నిజామాబాద్ అర్బన్: టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఈ నెల 5న బోనాల పండుగ నిర్వహించనున్నట్లు జి ల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవా ల్లో ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మె ల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, డాక్టర్ భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, సీపీ సాయి చైతన్య పాల్గొంటారని తెలిపారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన సభాస్థలిలో బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పాత కలెక్టరేట్ ఆలయంలో నవదుర్గా మాతకు సమర్పిస్తామని వివరించారు. ఉద్యోగ సంఘాలు నాయకులు, ఉద్యోగులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


