వైద్యం, వసతులు మెరుగవ్వాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యం, వసతులు మెరుగవ్వాలి

Aug 4 2026 1:47 AM | Updated on Aug 4 2026 1:47 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపర్చి మరింత నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రులు, వైద్య సౌ కర్యాలపై ఎమ్మెల్యేలతో సోమవారం ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిని త్వ రలోనే డీఎంఈ, మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్నతాధికారుల బృందం పరిశీలించనున్నట్లు మంత్రి దా మోదర తెలిపారు. జనరల్‌ ఆస్పత్రిలో మౌలిక వసతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని ధర్పల్లి, డిచ్‌పల్లి సీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌ చేయడంతోపాటు తిర్మన్‌పల్లి పీహెచ్‌సీలో వైద్యసిబ్బందిని పెంచాలని రూరల్‌ ఎమ్మెల్యే ఆర్‌. భూపతిరెడ్డి ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిత్యం 2 వేలకు పైగా ఓపీ ఉన్న జనరల్‌ ఆస్పత్రిలో ఎమ్మారై, మార్చురీ ఫ్రీజర్ల సౌకర్యంతోపాటు సివిల్‌ సర్జన్‌, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్ల సంఖ్య పెంచాలని నిజా మాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారా యణ కోరారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్‌గల్‌ 100 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని, ప్రస్తుత పీహెచ్‌సీని రహమత్‌నగర్‌కు తరలించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరా రు. మోర్తాడ్‌ మండలం పాలెం లేదా తిమ్మాపూర్‌లో పీహెచ్‌సీ ఏర్పాటు, బాల్కొండ సీహెచ్‌సీకి నూతన భవనం, సీహెచ్‌సీల్లో అధికారులు, సిబ్బంది నియామకంపై పలు వినతులను సమర్పించారు.

జిల్లా ప్రజాప్రతినిధులతో వైద్య,

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర సమీక్ష

ఆస్పత్రులు, వైద్య సదుపాయాలపై

ప్రత్యేక సమావేశం

జీజీహెచ్‌లో సౌకర్యాల పెంపునకు హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement