బోధన్: ఎడపల్లి మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువు అలుగు తూము నుంచి నీరు వృథాగా పో కుండా నీరుపాదల శాఖ అధికారులు శుక్రవారం తాత్కాలికంగా మూసివేయించారు. అలుగు తూ ము షట్టర్ రాడ్‌ను కొంత కాలం క్రితం గుర్తు తెలి యని వ్యక్తులు దొంగలించారు. ఆ తర్వాత తూము షట్టర్ మరమ్మతుకు నోచుకోలేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండి అలుగు తూము నుంచి నీరు వృథాగా పోతుంది. ఈ విషయం స్థానిక సర్పంచ్ కందగట్ల రాంచందర్‌కు రైతులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సర్పంచ్ నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన నీరుపాదల శాఖ ఏఈ కుషాల్ పరిశీలించి రైతుల సహకారంతో తూము నుంచి నీరు వృథా పోకుండా ఎండుగడ్డితో మూసివేయించారు. త్వరలోనే షట్టర్ రాడ్ బిగించి ఉపపయోగంలోకి తీసుకొస్తామని నీటిపారుదల శాఖ ఏఈ తెలిపారు.


