హజ్రత్‌షా బుఖారీ ఉర్సులో పోలీస్‌ కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

హజ్రత్‌షా బుఖారీ ఉర్సులో పోలీస్‌ కమిషనర్‌

Aug 1 2026 1:19 AM | Updated on Aug 1 2026 1:19 AM

బోధన్‌రూరల్‌/బోధన్‌టౌన్‌: పట్టణంలోని ప్రముఖ దర్గా హజ్రత్‌షా జలాల్‌ బుఖారీ దర్గా 675వ ఉర్సుకు జిల్లా పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ దర్గాలో సంప్రదాయబద్ధంగా చాదర్‌ సమర్పించి, గులాబీ పూలను అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పోలీ స్‌ కమిషనర్‌కు దర్గా నిర్వాహకులు ఘన స్వాగతం పలికి, జ్ఞాపికతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఏసీపీ శ్రీనివాస్‌, ఎస్‌హెచ్‌వో వెంకట్‌ నారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మీర్‌ ఇలియాస్‌ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదర్‌, మత పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement