బోధన్‌టౌన్: పట్టణంలోని వి నాయక్‌నగర్ కాలనీలో ఉన్న నీటి కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. వివరాలు.. పట్టణంలోని వినాయక్‌నగర్ కాలనీలోని నీటి కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని సమాచారం అందిందని అన్నారు. మృతుడి వయ సు 60 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై గులాబి రంగు టీషర్టు, ప్యాంటు ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 59870, 87126 59778 నంబర్లతో పాటు స్థానిక పీఎస్‌లో సంప్రదించాలన్నారు.
పేకాట స్థావరంపై దాడి
రుద్రూర్: పొతంగల్ మండల శివారులోని ఓ దాబాపై పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కోటగిరి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నిందితుల నుంచి రూ.50,040 నగదు, 9 బైక్‌లు, 16 ఫోన్లను స్వా ధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


