ఘనంగా బోనాల పండుగ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బోనాల పండుగ

Aug 1 2026 1:19 AM | Updated on Aug 1 2026 1:19 AM

బోధన్‌: సాలూర మండల కేంద్రంలో శుక్రవారం ఆనవాయితీగా వస్తున్న బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ పోలీస్‌ పటేల్‌ వెంకట్‌ పటేల్‌ నివాసం నుంచి మహిళలు బోనాలు ఎత్తుకుని, మంగళహారతులతో డప్పువాయిద్యాల మధ్య గ్రామ శివారులోని మహాలక్ష్మి మందిరానికి బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా పోతరాజుల విన్యాసాలు కొనసాగాయి. మహిళలు బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యే క పూజలు నిర్వహించారు. నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ యూనివర్సి టీ పాలక మండలి సభ్యులు అల్లె లావణ్య రమేశ్‌, సర్పంచ్‌ సొక్కం లావణ్య రవి, ఉపసర్పంచ్‌ భుయ్యన్‌ సురేశ్‌ పటేల్‌, గ్రామ పెద్దలు ఇల్తెపు శంకర్‌, గాండ్ల పెద్ద రాజేశ్వర్‌, లోకప్పగారి లక్ష్మణ్‌ పటేల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement