ఆర్మూర్: మండలంలో వివిధ వైకల్యాలతో బాధపడుతున్న 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో చేర్పించాలని ఆర్మూర్ ఎంఈవో రవీందర్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దివ్యాంగ విద్యార్థులకు టీఎల్‌ఎం సహకారంతో విద్యా బుద్ధులు నేర్పించడాన్ని పరిశీలించారు. కార్యాలయంలో దివ్యాంగ విద్యార్థుల ప్రొఫైల్స్, రికార్డులను పరిశీలించి ఐఈఆర్పీలు కిషన్, సురేష్‌తో మాట్లాడారు. డెయిలీ లివింగ్ స్కిల్స్‌తో పాటు సబ్జెక్టులను సైతం వారికి బోధించాలని సూచించారు. సీజీవీ కవితతో మాట్లాడి ఆమె విధుల గురించి సూచనలు చేశారు.


