మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుడి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుడి బాధ్యత

Aug 1 2026 1:19 AM | Updated on Aug 1 2026 1:19 AM

నందిపేట్‌(ఆర్మూర్‌): మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని నందిపేట ఎస్సై వినయ్‌ అన్నారు. శుక్రవారం వెల్మల్‌లో మన ఊరు– మన భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్‌ నేరా లు, మాదక ద్రవ్యాల నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్‌ మెసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్‌లో అనుమానాస్పద లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని సూచించారు. సర్పంచు దేవేందర్‌, పాలకవర్గ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement