నిజామాబాద్ అర్బన్: జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాను ని యమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవుల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, కలెక్టర్ ఇలా త్రిపాఠి భర్త అయిన భవేశ్ మిశ్రా జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించనుండటం విశేషం.
అడవులను కాపాడాలి
● డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్
సిరికొండ : అడవులు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని జిల్లా అటవీ శాఖ అధి కారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ ఆదేశించారు. సిరికొండ అటవీ రేంజ్ పరిధిలోని రావుట్ల బీట్ ప్రాంతాన్ని డీఎఫ్‌వో శుక్రవా రం తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని రేంజ్ కార్యాలయంలో సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతంలో పోడు చేపట్టకుండా గట్టి నిఘా పెట్టాలని సూచించారు. కబ్జాకు గురై స్వాధీనం చేసు కున్న భూముల్లో మొక్కలను నాటి సంరక్షించాలని తెలిపారు. డీఎఫ్‌వో వెంట ఆర్మూర్ ఎఫ్‌డీవో చంద్రశేఖర్ రావు, సిరికొండ రేంజర్ నర్సింగ్‌రావు, సిబ్బంది ఉన్నారు.
‘ఓపెన్’ పరీక్ష
ఫీజు చెల్లించాలి
ఖలీల్‌వాడి: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజును ఆగస్టు 1 నుంచి 18వ తేదీ వరకు చెల్లించాలని డీఈవో పార్శి అశోక్ ప్రకటనలో తెలిపారు. రూ.25 అపరాధ రుసుముతో ఆగస్టు 18 నుంచి 24 వరకు, రూ.50తో ఆగస్టు 25 నుంచి 29 వరకు, తత్కాల్ రుసుముతో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్ష ఫీజును టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్, మీసేవా సెంటర్‌లో చెల్లించవచ్చని తెలిపారు. సందేహాలుంటే ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ తుల రవీందర్ సెల్ నెంబర్ 9908896096, 9849234696 సంప్రదించాలని సూచించారు.
విదేశీ విద్యా అధ్యయన పర్యటనకు దరఖాస్తులు
ఖలీల్‌వాడి: విదేశీ విద్యా అధ్యయన పర్యటనకు జిల్లాలోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో పార్శి అశోక్ తెలిపారు. జిల్లా నుంచి ఏడుగురిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎం, ప్రిన్సిపాళ్ల కేడర్ నుంచి ఇద్దరు, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, పీఎస్‌హెచ్‌ఎం కేడర్ నుంచి ఇద్దరు, ఎస్జీటీ, టీజీటీ కేడర్ నుంచి ముగ్గురు ఉంటారని తెలిపారు. ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు ఉండేలా నామినేషన్లు చేపడతా మని వివరించారు. ఎంపికై న వారు ఫిన్‌లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం, చైనా దే శాల్లో నిర్వహించే విద్యా అధ్యయన కార్య క్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆగ స్టు 1 నాటికి 55 సంవత్సరాలలోపు వయసు, కనీసం 10 సంవత్సరాల సర్వీసు, ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో 100 మంది విద్యార్థుల నమోదు ఉండాలని తెలిపారు. అభ్యర్థిపై చార్జ్‌షీట్, విచారణ, క్రిమినల్ కేసు, అభియోగాలు ఉండొద్దని, హర్ట్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, బ్రెయిన్, న్యూరో, వెన్నుపూస సంబంధిత సమస్యలు ఉండకూడదన్నారు. దరఖాస్తు ఫారాలను www.deonizamabad.co.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఆగస్టు 4 వరకు కలెక్టరేట్‌లోని రూం నెంబర్ 117లో అందజేయాలని సూచించారు.
అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ రూరల్: టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో మూడు సంవత్సరాల అప్రెంటిస్‌షిప్ శిక్షణకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌ఎం కృష్ణమూర్తి శుక్రవా రం తెలిపారు. ఇంజినీరింగ్, డి ప్లొమా విభాగంలో ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఏఐ, మాథ్స్ బ్యాక్‌గ్రౌండ్, నాన్ ఇంజినీరింగ్ విభాగంలో బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ విద్యార్హతలు కలిగి ఉండాలన్నారు. 2022 తర్వాత ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీం(ఎన్‌ఏటీఎస్ 2.0) వెబ్‌సైట్‌లో ఆగస్టు 1 నుంచి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.


