● కలెక్టర్ వద్ద తుది జాబితా
● జిల్లాలో 112 పాఠశాలలు ఎంపిక
ఖలీల్‌వాడి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇన్‌స్ట్రక్టర్ల నియామకంపై సంది గ్ధం నెలకొంది. గతేడాది 68 పాఠశాలల్లో ప్రీ ప్రైమ రీ నిర్వహించగా, ఈ ఏడాది జిల్లాకు మరో 112 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. స్కూళ్లలో ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల భర్తీకి నెల రోజుల క్రితం మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 112 ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు 3,404 మంది, ఆయా పోస్టులకు 725 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో స్కూల్‌కు అర్హత కలిగిన ముగ్గురు అభ్యర్థుల పేర్లను జిల్లా విద్యాశాఖకు పంపించారు. అయితే, ఇన్‌స్ట్రక్ట ర్ల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు రావడంతో దరఖాస్తులను ఎంఈవోలతో తనిఖీ చేయించారు. అనంతరం జాబితాను ఎంఈ వో కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించి అ భ్యంతరాలను స్వీకరించారు. ఆ తర్వాత ఇన్‌స్ట్రక్టర్ల జాబితాను డీఈవోకు పంపించగా, జాబితాలో ని మొదటి పేరును కలెక్టర్‌కు పంపించారు. కలెక్టర్ ఆమోద ముద్ర వేస్తే నియామకం పూర్తవుతుందని విద్యాశాఖ అధికారుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం కలెక్టర్ సెలవుల్లో ఉండటంతో ఇన్‌స్ట్రక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందనే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రీ ప్రైమరీ స్కూలుకు సంబంధించిన వస్తువుల కోసం అధికా రులు టెండర్లు నిర్వహించారు. కానీ, ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరగకపోవడంతో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.
3 నుంచి ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ
ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు ఈ నెల 3వ తేదీ నుంచి 6 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ర మేశ్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరగకపోవడంతో శిక్షణ ఎలా నిర్వహిస్తారని చర్చ జరుగుతోంది.
మూడు రోజుల్లో పూర్తిచేస్తాం
ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకం మూడు రోజుల్లో పూర్తిచేస్తాం. అనంతరమే శిక్షణ అందిస్తాం. నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
– పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్


