కష్టాల కేజీబీవీలు | - | Sakshi
Sakshi News home page

కష్టాల కేజీబీవీలు

Aug 1 2026 1:07 AM | Updated on Aug 1 2026 1:07 AM

ఆర్మూర్‌: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. నాలుగు నెలలకు సంబంధించి గ్రాంట్స్‌ విడుదల కాకపోవడంతో నిర్వహణ భారమవుతోంది. స్పెషల్‌ ఆఫీసర్ల జీతాలతోపాటు అప్పులు తెచ్చి నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 27 కేజీబీవీలు ఉండగా, అందులో 7,160 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరి భోజనానికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, గుడ్లు, చికెన్‌, బియ్యం లాంటి ముఖ్యమైనవి సమగ్ర శిక్ష అధికారులు కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తుంటారు. కానీ, వంట కోసం ఉపయోగించే సిలిండర్‌, గ్రైండర్‌, ఫ్యాన్లు, బోరు మోటార్‌, లైట్లు తదితర మరమ్మతులతోపాటు స్టేషనరీ, తాగునీటి అవసరాలకు స్పెషల్‌ ఆఫీసర్లు సొంత డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. గతంలో పెట్టీ క్యాష్‌ రూపంలో కేజీబీవీల కు ప్రతినెలా కొంత మొత్తాన్ని ముందుగానే కేటాయించే వారు. ఈ విధానాన్ని తొలగించి, బిల్లులు సమర్పిస్తే డబ్బులు చెల్లిస్తామని అధికారులు సూచించడంతో స్పెషల్‌ ఆఫీసర్లపై ఆర్థిక భారం పడుతోంది. బిల్లులు సమర్పించిన్పటికీ మార్చి, ఏప్రిల్‌తోపాటు జూన్‌, జూలై నెలలకు సంబంధించి నిధులు మంజూరు కాలేదు.

సందర్శనలే తప్ప పరిష్కారం కరువు

కలెక్టర్‌ను మొదలుకొని డీఈవో, సెక్టోరల్‌ ఆఫీసర్లు, ఎంఈవో, ఎంపీడీవో, స్పెషల్‌ ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు కేజీబీవీలను సందర్శించి సూచనలు ఇవ్వడం తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ప లువురు ఎస్‌వోలు ఆరోపిస్తున్నారు. ఇటీవల అన్ని కేజీబీవీల ఎస్‌వోలు జాయింట్‌ కలెక్టర్‌ భుజంగరావును కలిసి సమస్యను వివరించారు. కనీసం సిలిండర్‌ ఏజెంట్లకు ఇవ్వాల్సిన నిధుల విషయంలోనైనా స్పష్టతనివ్వాలని కోరగా, నిధుల విడుదలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. నిధుల మంజూరు ఆలస్యంపై స్పష్టత కోసం సమగ్ర శిక్ష సెక్టోరల్‌ అధికారిణి భాగ్యలక్ష్మిని ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి నుంచి స్పందన రాలేదు.

జిల్లాలో మొత్తం కేజీబీవీలు 27

మొత్తం విద్యార్థినులు 7,160

ఎస్‌వో జీతం నుంచే ఖర్చులు

ఒక్కో కేజీబీవీకి ప్రతి రోజు ఒక సిలిండర్‌, ఇతర ఖర్చుల రూపంలో నెలకు సుమారు రూ.40 వేల వరకు అవసరం అవుతుంది. నాలుగు నెలలుగా గ్రాంట్‌ రాకపోవడంతో స్పెషల్‌ ఆఫీసర్లే ఖర్చులు భరిస్తున్నారు. వారికి వచ్చే రూ.32,500 వేతనంతోపాటు అప్పు తెచ్చి కేజీబీవీలను నిర్వహించడం తలకు మించిన భారమవుతోంది. ఖర్చులు చేయలేక, కాంట్రాక్ట్‌ ఉద్యోగం వదులుకోలేక మానసిక వేదనకు గురవుతున్నారు.

నిర్వహణ నిధులు లేక

అల్లాడుతున్న వైనం

నాలుగు నెలలుగా విడుదలకాని

మెయింటెనెన్స్‌ గ్రాంట్‌

సొంత డబ్బులతో నిర్వహిస్తున్న

స్పెషల్‌ ఆఫీసర్లు

అప్పుల పాలవుతున్నామంటూ

అధికారులకు వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement