● వారం రోజుల్లో 8 టీఎంసీల ఇన్‌ఫ్లో
వేల్పూర్ (మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వారం క్రితం 15 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రవాహంతో ప్రాజెక్టు నీటిమట్టం 23 టీఎంసీలకు చేరింది. శుక్రవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 4 టీఎంసీల నీరు వచ్చి చే రింది. ఎగువ ప్రాంతాల నుంచి 51,320 క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 1091 (80.05 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1070 అడుగులు (24.052 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1075 అడుగుల(32.897 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 330, ఆవిరి రూపంలో 220, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో అవుతోందని అధికారులు తెలిపారు.
చేపల వేట నిషేధం
డొంకేశ్వర్/వేల్పూర్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎస్సారెస్పీ నది పరీవాహక ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని జిల్లా అదనపు కలెక్టర్ భుజంగరావు, మత్స్యశాఖ అధికారి బి.నాగులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోందని, ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో చేపల వేట కొనసాగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి చేపల వేటకు వెళ్లకూడదని కోరారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం
నేడు మంత్రుల రాక
వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టును శనివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సందర్శిస్తారని ఎస్సారెస్పీ అధికారులు శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో హెలికాప్టర్‌పై ఉదయం 11 గంటలకు బయలుదేరి, 11.45 నిమిషాలకు శ్రీరాంసాగర్ చేరుకుంటారని పేర్కొన్నారు. 12.30 గంటల వరకు ప్రాజెక్టును పరిశీలించి అనంతరం నిర్మల్ జిల్లాకు వెళ్తారని తెలిపారు.


