డొంకేశ్వర్(ఆ ర్మూర్): ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను గ్రామీణ ప్రజ లు సద్వినియో గం చేసుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే, వారికి వెంటనే అర్థమయ్యే రీతిలో సందేశాలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేసే విధంగా మోటు, పత్లూ కార్టూన్ లు మాట్లాడుతున్నట్లుగా ఐఏ వీడియోలను క్రియేట్ చేసి వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి మా ధ్యమాలలో షేర్ చేస్తున్నారు. చెరువు అ లుగులు పారుతున్నాయని, వంతెనల వద్ద ప్రమాదకర పరిస్థితి ఉందని, రోడ్డు తెగిపో యిందని, ప్రజలు బయటకు రావొద్దంటూ సూచిస్తూ పలు గ్రామాలు ఏఐ సందేశాలను రూపొందించి వైరల్ చేస్తున్నాయి.
ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ ప్రాజెక్టుకు మంజూరు ఇవ్వండి
ఆర్మూర్ : ఆదిలాబాద్ – నిర్మల్ – ఆర్మూర్ మధ్య కొత్త రైల్వే ప్రాజెక్టు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో రైల్వే మంత్రితో గురువారం భేటీ అయ్యారు. రైల్వే లైన్ ప్రాధాన్యతను వారు కేంద్ర మంత్రికి వివరించినట్లు సమాచారం. ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేసి, పనులు ప్రారంభించాలని విన్నవించారు. కేంద్ర మంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మంత్రితో భేటీ అయిన వారిలో ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, మాధవనేని రఘునందన్, గోడెం నగేష్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణతోపాటు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేశ్ రాథోడ్ ఉన్నారు.
ఊర పండుగకు
బండారు
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలో ఊర పండుగ సందడి మొదలైంది. ఆగస్టు 2వ తేదీన పండుగ నిర్వహించనున్న నేపథ్యంలో నిజామాబాద్ సర్వసమాజ్ కమిటీ, విజయ్ కిసాన్ ము న్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గురువారం భక్తి శ్రద్ధలతో నగరంలోని నలుదిక్కు లా బండారు పోశారు. సర్వ సమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదె ప్రవీణ్, విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కోరడి కిరణ్, ఉపాధ్యక్షులు, కార్పొరేటర్ మల్కా యి మహేందర్, మాజీ కార్పొరేటర్ రామడుగు బాలకిషన్, సెక్రెటరీ దామ ఇంద్రకరణ్, పెద్ద కాపులు మల్కాయి లక్ష్మీనారాయణ, గంట పెద్ద నర్సయ్య, స్వామి, లింబాద్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.


