● వీసీలో సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
● భారీ వర్షాల నేపథ్యంలో సమీక్ష
నిజామాబాద్ అర్బన్ : భారీ వర్షాల నేపథ్యంలో అ న్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి డీ జీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లా స్థాయిలో 24x7 అందుబాటులో ఉండే లా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితుల ను పర్యవేక్షించాలని సూచించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. సమా చార వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, కూలిపో యే ప్రమాదం ఉన్న పాత భవనాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో జ లాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రహదారుల పరిస్థితిని సమీక్షిస్తూ రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారులు త ప్పనిసరిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ను అనుసరించాలన్నారు. పోలీసు శాఖ ఇతర శాఖల సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వీసీ లో అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్వో గీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


