అందుబాటులో ఉండండి.. | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో ఉండండి..

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ

సలహాదారు సుదర్శన్‌రెడ్డి సూచన

భారీ వర్షాల నేపథ్యంలో

అధికారులతో సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌: ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తాము పని చేస్తున్న ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. అదనపు కలెక్టర్‌ భుజంగరావుతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ఆయన జిల్లాలో భారీ వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ 08462 220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరాకు, రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

పక్కాగా ఎస్‌ఐఆర్‌..

భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియను జిల్లాలో ప క్కాగా పూర్త చేయాలని ప్రభుత్వ సలహాదారు సు దర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా నుంచి గల్లంతు కావొద్దన్నా రు. అదేసమయంలో డబుల్‌ ఓట్లు, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితాలో లే కుండా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో గీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement