ఎస్సారెస్పీలోకి 76వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీలోకి 76వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

అనూహ్యంగా వరద ఉధృతి

గంటగంటకూ పెరిగిన ప్రవాహం

వేల్పూర్‌(మెండోరా): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. గురువారం ఉదయం 6,250 క్యూసెక్కులతో ప్రారంభమైన ఇన్‌ఫ్లో రాత్రి సమయానికి 76,224 క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 1067.4 అడుగుల( 19.224 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1077.10 అడుగుల (37.632 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 220 క్యూసెక్కుల నీరుపోతోంది. మిషన్‌ భగీరథ అవసరాలకు 220 క్యూసెక్యుల నీటిని వినియోగిస్తున్నారు.

నిజాంసాగర్‌లోకి 3,935 క్యూసెక్కులు..

నిజాంసాగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల తో పాటు మెదక్‌ జిల్లాలోని ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుండడంతో గురువారం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 3, 935 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1,395.92 అడుగుల (7.53 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.

ఇన్‌ఫ్లో పెరిగింది ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement