న్యూస్‌రీల్
విద్యార్థులు లక్ష్యాన్ని..
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశ గా పయనించాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు.
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
– 8లో u
యువకుడి మృతదేహాన్ని తీసుకొస్తున్న గజ ఈతగాళ్లు, పోలీసులు
వేల్పూర్(మెండోరా)/నిజామాబాద్ అర్బన్: సరదా గా పిక్నిక్‌కు వెళ్లిన చేతికొచ్చిన కొడుకులు నీటమునిగి మృత్యువాతపడడంతో కన్నవారు కన్నీటి పర్యంతమవుతున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబాల రెక్కలు తెగిపోయాయి! నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన అమ్ము అలియాస్ నజువత్(24), అజీమ్(24), అర్సపల్లికి చెందిన కలీం(23), మహారాష్ట్రలోని భోకర్‌కు చెందిన అర్హాన్(17)తోపాటు మరో యువకుడు కలిసి ఆదివారం ఎస్సారెస్పీ ప్రాంతానికి పిక్నిక్‌కు వెళ్లారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని లక్ష్మీకాలువ హెడ్‌రెగ్యులేటరీ వద్ద కాలువలో నలుగురు గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు , ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అ గ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్య లు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అర్హాన్ ఆచూకీ లభించలేదు. సీపీ సాయిచైతన్య గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
అజీమ్‌ఖాన్ డిచ్‌పల్లిలోని ఓ ప్రైవేట్ షోరూమ్‌లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్న అజీమ్‌ను స్నేహితులు వచ్చి వెంట తీసుకెళ్లారని తెలిసింది. అతడి తండ్రి ఉస్మాన్‌ఖాన్ బియ్యం దుకాణంలో పని చేస్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తండ్రి షాక్‌లోకి వెళ్లాడు. కలీం ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నట్లు తెలిసింది. ఉన్నత విద్యనభ్యసించి కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కొడుకు నీటమునిగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అమ్ము అలియాస్ నజువత్‌ది సైతం పేద కుటుంబమని స్థానికుల ద్వారా తెలిసింది.
రెండేళ్ల కింద ముగ్గురు..
రెండేళ్ల క్రితం ఎస్సారెస్పీ లక్ష్మీకాలువ హెడ్ రెగ్యులేటరీ వద్ద నీటిలో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. జక్రాన్‌పల్లి మండలం గన్యాతండాకు చెందిన అజ్మీరా సాయినా థ్, బనావత్ లోకేశ్, అజ్మీరా సాయికిరణ్ అలియాస్ మున్నా, వంశీ, గోపాల్ అనే ఐదుగురు యువకులు కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం పోచంపాడ్‌కు వచ్చారు. ముందుగా గోదావరిలో స్నానం చేసేందుకు లక్ష్మీకాలువ హెడ్ రెగ్యులేటరీ వద్ద నీటిలోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురు స్నేహితులు మృత్యువాతపడ్డారు.
ఎస్సారెస్పీ ప్రాంతానికి సరదాగా పిక్నిక్‌కు వెళ్లి కానరాని లోకాలకు
లక్ష్మీకాలువ హెడ్‌రెగ్యులేటరీ ప్రాంతంలో నలుగురు యువకుల గల్లంతు
ముగ్గురి మృత్యువాత..
లభించని మరొకరి ఆచూకీ
జిల్లా కేంద్రంలోని ఆటోనగర్, అర్సపల్లిలో విషాదఛాయలు


