గాలింపు చర్యలను పర్యవేక్షించిన సీపీ | - | Sakshi
Sakshi News home page

గాలింపు చర్యలను పర్యవేక్షించిన సీపీ

Jul 27 2026 2:00 AM | Updated on Jul 27 2026 2:00 AM

వేల్పూర్‌(మెండోరా): ఎస్సారెస్పీలో యువకులు గల్లంతైన సమాచారం అందుకున్న సీపీ సాయిచైతన్య హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నా రు. ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్‌ రూ రల్‌ సీఐ జాన్‌రెడ్డితో మాట్లాడి ప్రమాద వివరా ల ను తెలుసుకున్నారు. ముగ్గురు యువకుల మృతదేహాలను గజఈతగాళ్లు వెలికితీశారు. సుమారు 8.30గంటల వరకు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉన్న సీపీ.. మరో యువకుడి ఆచూకీ గుర్తింపు కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. మెండోరా ఎస్సై సుహాసిని, స్థానిక సిబ్బంది, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలి

ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. ప్రాజెక్టులు, బ్యాక్‌వాటర్‌ ప్రాంతాలు, చెరువులు, కాలువలు, నదుల వద్ద సెల్ఫీలు దిగడం, ఈత కొట్టడం, సరదాగా నీటిలోకి దిగడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రవాహ వేగం, లోతు తెలియని ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, పోలీసు, సంబంధిత శాఖల సూచనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement