● భర్తీకానున్న 76 అంగన్‌వాడీ టీచర్.. 103 ఆయా పోస్టులు
నిజామాబాద్ రూరల్: జిల్లాలోని అంగన్‌వాడీ సెంటర్లలో టీచర్, ఆయా పోస్టుల భర్తీలో భాగంగా సోమవారం నుంచి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, డిచ్‌పల్లి, భీమ్‌గల్ సీడీపీవో ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి సౌందర్య ఆదివారం తెలిపారు. ఇప్పటికే నాలుగు వేలకుపైగా దరాఖాస్తు అందాయని, 76 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 103 ఆయా పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. దరఖాస్తుదారులు నిర్ణీత సమయంలో హాజరుకావాలని సూచించారు.
బాల్కొండ ఎంఈవో సస్పెండ్
ఖలీల్‌వాడి: శిక్షణ సమయంలో ఉపాధ్యాయులకు నాసిరకం భోజనం పెట్టించడంతోపాటు విద్యార్థులకు ఇవ్వాల్సిన నోట్‌బుక్స్ ఇచ్చారనే కారణంగా బాల్కొండ ఎంఈవో రాజేశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్య వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ మదన్‌మోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మూర్ డివిజన్‌లోని ఉపాధ్యాయులకు ఎస్‌ఏ సోషల్ స్టడీస్ శిక్షణ తరగతులను బాల్కొండలో ఈనెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉచిత నోట్‌బుక్స్‌ను శిక్షణ సమయంలో ఉపాధ్యాయులకు ఇవ్వడంతోపాటు నాసిర కం భోజనం పెట్టారనే ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టి ఎంఈవోపై చర్యలు తీసుకున్నారు.
సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
ఖలీల్‌వాడి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పురుషుల, మహిళా క్రీడాకారుల ఎంపికలను నిజామాబాద్ నగరంలోని క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించినట్లు అ సోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్యామ్ తెలిపా రు. ఎంపికలకు ముఖ్యఅతిథిగా అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం శ్రావణ్‌రెడ్డి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారన్నా రు. ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలగ్రౌండ్స్‌లో నిర్వహించే 72వ తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని శ్యామ్ తెలిపారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు నరేంద్రచారి, సులోచన, భాగ్యశ్రీ, రూప తదితరులు పాల్గొన్నారన్నారు.
లింబాద్రిగుట్టపై
న్యాయమూర్తుల పూజలు
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీమ్‌గల్ లింబాద్రి గుట్టపై లక్ష్మీనృసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు. న్యాయమూర్తులు తంగిరాల మాధవీదేవి, అలిశెట్టి లక్ష్మీనారాయణ, గడి ప్రవీణ్‌కుమార్‌తోపాటు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి గుట్టపైకి రాగా.. ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆర్మూర్ సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జి శ్రీదేవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరళారాణి, అడిషనల్ కోర్టు జడ్జి, భీమ్‌గల్ కోర్టు ఇన్‌చార్జి భవ్యశ్రీ, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్‌చందర్, న్యాయవాదులు గజ్జెల చైతన్య, సూర సురేశ్ తదితరులున్నారు.


