సోయాకు ఊపిరి పోసిన వర్షం | - | Sakshi
Sakshi News home page

సోయాకు ఊపిరి పోసిన వర్షం

Jul 27 2026 2:00 AM | Updated on Jul 27 2026 2:00 AM

జిల్లాలో 35 వేల ఎకరాల్లో పంట సాగు

బోధన్‌: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సోయా పంటకు ఊపిరిపోశాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సోయా సాగైందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అలాగే మంజీర, గోదావరి నదుల తీరంలో ఉన్న బోధన్‌ డివిజన్‌ పరిధిలోని బో ధన్‌, సాలూర, పొతంగల్‌, రెంజల్‌ మండ లాల్లో వర్షాధార మెట్ట భూముల్లో సో యాను రైతులు విస్తారంగా సాగు చేశారు. సాలూర, రెంజల్‌ మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల చొప్పున పంట సాగవుతోంది. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు విత్తు వే సేందుకు ప్రారంభంలో ఆలోచించారు. తొల కరి వర్షం పలకరించగానే విత్తనాలు అలకడం మొదలు పెట్టారు. 30 రోజుల క్రి తం విత్తనా లు విత్తగా.. వర్షాలు లేకపోవడంతో వారం రోజుల క్రితం వరకు మొలకలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న తేలకపాటి వర్షాలు సోయాకు ఊపిరిపోశాయి. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతు వేదికల్లో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ చ ర్యలను ప్రారంభించింది. జిల్లాలోని మండలానికి ఒక రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు డీఏవో వీరాస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమ, మంగళ, బుధ వా రాల్లో వరుసగా మూడు రోజుల పాటు మిను ము, పెసర, కంది, మక్క, తదితర విత్తనాల ను విక్రయిస్తారని తెలిపారు. రైతులు అవసరమైన విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని డీఏవో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement