రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

మృతికి కారణమైన ఒకరికి జైలు

ఆర్మూర్‌టౌన్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్‌ పట్టణం సిద్దులగుట్ట వెనకాల ఆదివారం చోటు చేసుకున్నది. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప ట్టణానికి చెందిన చౌల్‌ దినేశ్‌చంద్ర(54) స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాఫ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం రాత్రి దినేశ్‌ సిద్దులగుట్ట వెనుక నుంచి ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దినేశ్‌ మృతి చెందాడన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మాక్లూర్‌: వాహనంతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన ఒకరికి సంవత్సరంపాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఎస్సై అనిల్‌ రెడ్డి సోమవారం తెలిపారు. 2017లో నిజామాబాద్‌కు చెందిన షేక్‌ ఖాసిం అతడి స్నేహితుడు షేక్‌ అఫ్జల్‌, షేక్‌ సర్వర్లతో కలిసి బైక్‌పై వస్తుండగా అడవి మామిడిపల్లి శివారులో టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దీంతో వారు బైక్‌ను నెట్టుకుంటూ నిజామాబాద్‌ వైపు వస్తుండగా దాస్‌నగర్‌లోని ఓ ప్రయివేటు పాఠశాల ఎదుట వెనుక నుంచి వచ్చిన టాటాక్వాలిస్‌ వాహనం ఢీకొట్టింది. దీంతో షేక్‌ అఫ్జల్‌ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా షేక్‌ ఖాసీం, షేక్‌ సర్వర్లకు గాయాలయ్యాయి. పోలీసులు డ్రైవర్‌ మోబీన్‌ పటాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ అనంతరం సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి.. అజాగ్రత్త డ్రైవింగ్‌తో ఒకరి మృతికి కారణమైన నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ. రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement