ఎల్లారెడ్డి: పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆదివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ, పన్నాలాల్ కాలనీ, బీసీ కాలనీలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారు జాము 4 నుంచి 7 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని, చలాన్లు ఉన్న 135 ద్విచక్ర వాహనాలను, 8 ఆటోలను, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడూతూ.. సరైన పత్రాలు లేకుండా వాహనాలను నడిపించకూడదని, చలాన్లను బకాయి లేకుండా చూడాలని సూచించారు. తమ ప్రాంతంలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి, సదాశివనగర్ సీఐ సంతోష్, ఎల్లారెడ్డి ఎస్సై రాజు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


