న్యూస్‌రీల్
జిల్లాను ఎడారిగా..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు జిల్లాను దశాబ్దాలుగా ఎడారిగా మారుస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ విమర్శించారు.
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
– 8లో u
నిజామాబాద్ నగరంలోని పోచమ్మ ఆలయం
గట్టు, పుట్ట, చెట్టు.. నడి ఊరు, ఊరి శివారు.. అంతటా ఆ తల్లి కొలువుదీరింది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ పేరు ఏదైనా.. కొత్త కుండలో పాలు, బియ్యం, బెల్లం కలిపి తల్లికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించే ఆషాఢం సందడి జిల్లాలో మొదలైంది. డప్పు చప్పుళ్లు, అమ్మవారి సోదరుడైన పోతరాజు విన్యాసాలతో పల్లె, పట్టణం తేడాలేకుండా కళకళలాడుతోంది. జిల్లా కేంద్రంలో దేవీమాత, పోచమ్మ, నందిపేట మండలంలోని కుద్వాన్‌పూర్ ఎల్లమ్మ, భీమ్‌గల్ మండలంలోని బడాభీమ్‌గల్ పెద్దంగంటి ఎల్లమ్మ, బోధన్ పట్టణంలోని రేణుకాఎల్లమ్మ, నల్లపోచమ్మ, పెద్ద పోచమ్మ, మహాలక్ష్మమ్మ, బాల్కొండ మండలంలోని శ్రీరాంపూర్ చిలుకల చినమ్మ తదితర ఆలయాల్లో బోనాల సందడి నెలకొంది. ఆ తల్లి చల్లనిచూపు తమపై ఉండాలని, పిల్లాపాపలతో తాము సంతోషంగా ఉండాలని కోరుతూ జిల్లాలోని అమ్మవార్ల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. – నిజామాబాద్ రూరల్


