పంద్రాగస్టు నాటికి యూనిఫామ్‌ | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు నాటికి యూనిఫామ్‌

Jul 19 2026 1:08 AM | Updated on Jul 19 2026 1:08 AM

ఖలీల్‌వాడి: పాత యూనిఫామ్‌లతోనే ప్రభుత్వ పా ఠశాలలకు వెళ్తున్న విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి కొత్త యూనిఫామ్‌లు అందనున్నాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నుంచి స్పష్టత రాగా, యూనిఫామ్‌ కుట్టుపనులకు సంబంధించి ఇప్పటికే మండలాల వారీగా ఎంఈవో, ఏపీఎంలు, హెడ్‌మాస్టర్లకు అవగాహన కల్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలోని విద్యాలయాలకు మొత్తం 3.65 లక్షల మీటర్ల క్లాథ్‌(బట్ట)ను నేరుగా మండల రిసోర్స్‌ సెంటర్లకు అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారు లు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 25న మొదటి విడతలో, ఆగస్టు 13 రెండో విడతలో మొత్తం 3.65 లక్షల మీటర్ల క్లాథ్‌ సరఫరా కానుంది.

త్రీమెన్‌ కమిటీ

విద్యార్థులకు యూనిఫామ్స్‌ అందించేందుకు ఈ ఏడాది మార్చి – ఏప్రిల్‌లోనే పాఠశాలల్లో కొలతలు తీసుకున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత పాఠశాలల్లో చేరిన సుమారు 6వేల మందికిపైగా విద్యార్థులకు యూనిఫామ్‌ అందజేయడంపై స్పష్టత రాలేదు. మండల కేంద్రంలోని ఎంఆర్‌సీ భవనంలో ఎంఈవో, ఏపీఏం, మండల సమాఖ్య అధ్యక్షులతో త్రీమెన్‌ కమిటీ ఏర్పాటు చేస్తారు. యూనిఫామ్‌ కట్టు పనులను గ్రామాల వారీగా మహిళ సంఘాలకు అప్పగిస్తారు. కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు గ్రామ మహిళా సంఘాలను అటాచ్‌ చేస్తారు. మండలాల వారీగా త్రీమెన్‌ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది.

కేజీబీవీల్లో..

జిల్లాలోని 27 కేజీబీవీల్లో 7,019 మంది విద్యార్థినులకు గాను 5,190 మందికి యూనిఫామ్‌లు అందించారు. మిగతా యూనిఫామ్‌లు వారం రోజుల్లోగా అందించానున్నారు. జిల్లాలోని నవీపేట్‌, నందిపేట్‌, బాల్కొండ, మోర్తాడ్‌, జక్రాన్‌పల్లి, మోపాల్‌ కేజీబీవీలకు వైట్‌ యూనిఫామ్‌ను సైతం అదనంగా అందిస్తారు.

కొత్త మోడల్‌ యూనిఫామ్స్‌

స్వయం సహాయక సంఘాలకు..

విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించేందుకు అవసరమైన క్లాథ్‌ జిల్లాకు రెండు విడతల్లో సరఫరా కానుంది. ఈ క్లాథ్‌ను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించి, కుట్టు బాధ్యతను ఇస్తారు. పంద్రాగస్టు వరకు విద్యార్థులకు కొత్త యూనిఫాం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా లోని కేజీబీవీల విద్యార్థినులకు యూనిఫామ్‌లు ఇదివరకే అందించాం.

– పార్శి అశోక్‌, డీఈవో, నిజామాబాద్‌

ఈ విద్యాసంవత్సరం నుంచి యూనిఫామ్‌ రంగు, డిజైన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. బా లురకు నీలం రంగు చొక్కా, లేత నీలంరంగు ని క్కర్‌ లేదా ప్యాంటు, బాలికలకు లాంగ్‌ ఫ్రాక్‌, షర్ట్‌, స్కర్ట్‌ తరగతుల వారీగా అందించనున్నా రు. గతంలో ఉన్న ప్యాచ్‌ వర్క్‌, అలంకరణను తొలగించిన ప్రభుత్వం సాధారణ నమూనాను ఖరారు చేసింది. తెలంగాణ చేనేత సహకార సంస్థ కేజీబీవీలకు, ప్రభుత్వ పాఠశాలలకు మఫత్‌లాల్‌ కంపెనీ క్లాథ్‌ను సరఫరా చేయనున్నాయి.

రెండు విడతల్లో జిల్లాకు 3.65 లక్షల మీటర్ల క్లాథ్‌

కొత్త డ్రెస్‌ల కోసం మార్చి – ఏప్రిల్‌లోనే కొలతల సేకరణ

ప్రస్తుతం పాత దుస్తులతోనే

బడికెళ్తున్న పిల్లలు

జిల్లాలో 1156 స్కూళ్లు..

83,083 మంది విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement