నిజామాబాద్‌అర్బన్ : ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికల రూపకల్పనకు చర్య లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్‌తో సమీక్షించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవాల్సిన చర్య లపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20న జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా సమావేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించి, ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించా లని సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లో అవసరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు నుంచి వ చ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చర్య లు తీసుకోవాలని పేర్కొన్నారు. వీసీలో కలెక్టర్ ఇ లా త్రిపాఠి, డీఆర్వో గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
వీసీలో సీఎస్ సంజయ్ జాజు
తాగు, సాగునీటి ఇబ్బందులు
తలెత్తకుండా చూడాలి
నిరంతరాయంగా విద్యుత్
సరఫరా చేయాలి


