ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం | - | Sakshi
Sakshi News home page

ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం

Jul 19 2026 12:56 AM | Updated on Jul 19 2026 12:56 AM

నిజామాబాద్‌ రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇ చ్చిన హామీలను అంచెలంచలుగా నెరవేరుస్తుందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను దిగమింగుకుని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్‌ రెడ్డికి దక్కుతుందన్నారు. నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అర్వింద్‌ వారి ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన రెండున్నరేళ్లలో సుమారు 70వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిందన్నా రు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుండగా బీజేపీ నేతలకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలన్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి చరిత్ర అందరికి తెలుసని, బీజేపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవటానికి విమర్శలు చేస్తున్నారని వీటిని ప్రజలు, విద్యార్థులు నమ్మవద్దన్నారు. ఇప్పటికయినా బీజేపీ నాయకులు ప్రతిపక్ష పాత్ర వహించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement