జిల్లాను ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాను ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వాలు

Jul 19 2026 12:56 AM | Updated on Jul 19 2026 12:56 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి

సుభాష్‌నగర్‌: గత బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కలిసి జిల్లాను 18 ఏళ్లుగా ఎడారిగా మారుస్తున్నా యని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచా రి విమర్శించారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. జిల్లాలోని శ్రీరామ్‌ సాగర్‌, ని జాంసాగర్‌ ప్రాజెక్టు పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో సాగునీరు విషయంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మంచిప్ప ప్రాజెక్ట్‌ ప్యాకేజీ పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం 30 నెలల నుంచి ఒక తట్టేడు మట్టి ఎత్తింది లేదని, ఒక పైపు వేసింది లేదని ఆరోపించారు. గతంలో బాజిరెడ్డి, కవితల మధ్య కమీషన్ల పోరులో ప్రాజెక్ట్‌ నలిగిపోయి రైతంగం నష్టపోయిందని, ఇప్పుడు ఎ మ్మెల్యేలు భూపతిరెడ్డి, సుదర్శన్‌ రెడ్డిల మధ్య కమీ షన్ల కుమ్ములాటల వల్ల ప్రాజెక్టులు మరోసారి బలి అవుతున్నాయన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి దూ రమవ్వడానికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణ మని ఆరోపించారు.

రూరల్‌ ఎమ్మెల్యేకు సవాల్‌..

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ప్రా జెక్ట్‌ ప్యాకేజీ 20, 21, 22 గురించి కనీస అవగాహన కూడా లేదని, ఇటువంటి అజ్ఞానంతో ప్రాజెక్ట్‌ను ఎ లా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు. ప్యాకేజీ పనులతోపాటు గుత్ప, అలీసాగర్‌ లిఫ్ట్‌లపై బహిరంగ చర్చకు రావాలని వారికి సవాల్‌ విసిరారు. పాత డిజైన్ల పేరుతో మళ్లీ రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే, రైతులు తిరగబడే రోజులు వస్తాయన్నారు. నాయకులు గద్దె భూమన్న, నక్క రాజేశ్వర్‌, ఓం సింగ్‌, ఆనంత్‌ రెడ్డి, కర్క గంగారెడ్డి, చింత శ్రీనివాస్‌ రెడ్డి, నరేష్‌, శంకర్‌ రెడ్డి, గంగారెడ్డి, శశాంక్‌, జగన్‌రెడ్డి పాల్గొన్నారు.

డీడీవోపీగా రజిని బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్‌ లీగల్‌ : నిజామాబాద్‌ ఫ్యామిలీ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియామకమైన యం.రజిని శనివారం ఇన్‌చార్జి డీడీవోపీ రహీముద్దీన్‌ నుంచి డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ (డీడీవోపీ)గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లలో రజిని గ్రేడ్‌ వన్‌ కేటగిరీ కావడంతో డీడీవోపీగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ కోర్టులకు చెందిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement