కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం ప ల్లికొండ గ్రామానికి చెందిన మేకల రితీష్ అనే విద్యార్థి నీట్‌లో ప్రతిభ చాటాడు. ఆలిండియా లెవెల్‌లో 18972 ర్యాంక్ సాధించాడు. రితీష్ తండ్రి వినోద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి ప్రయివేట్ ఉపాధ్యాయురాలిగా పని చే స్తోంది. రితీష్ ఇంటర్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజ్‌లో చదువుగా, అదే కాలేజ్‌లో నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయి పరీక్ష రాశాడు. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ప్రతిభ చాటాడు. ఎంబీబీఎస్ పూర్తి కాగానే పీజీలో కార్డియోలాజిస్ట్ స్పెషలైజేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రితీష్ తెలిపారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలందిస్తానని తెలిపాడు.
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి నిర్వహించిన ఇంటర్ సర్కిల్ వాలీబాల్, బాల్ బ్యా డ్మింటన్, క్యారం క్రీడా పోటీలు శనివారం ము గిశాయి. టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) మధుసూదన్, హెచ్‌ఆర్‌డీ సి.ప్రభాకర్ ము ఖ్య అతిథులుగా హాజరై వివిధ క్రీడల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు.
వివిధ క్రీడల్లో గెలుపొందిన జట్లు..
బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో టీజీఎన్పీడీసీఎల్ వరంగల్ ఆపరేషన్ సర్కిల్ జట్టు ప్రథమ బహుమతి, టీజీఎస్పీడీసీఎల్ నల్లగొండ సర్కిల్ జట్టు ద్వితీయ బహుమతి, టీజీఎస్పీడీసీఎల్ మహబూబ్‌నగర్ సర్కిల్ జట్టు తృతీయ బహుమతి కై వసం చేసుకున్నాయి. వాలీబాల్ విభాగంలో టీజీఎన్‌న్పీడీసీఎల్ ఖమ్మం ఆపరేషన్ సర్కిల్ జట్టు ప్రథమ బహుమతి, టీజీఎస్పీడీసీఎల్ మహబూబ్‌నగర్ సర్కిల్ జట్టు ద్వితీయ బహుమతి, టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్ సౌత్ సర్కిల్ జట్టు తృతీయ బహుమతి సాధించాయి. క్యారం విభాగంలో టీజీఎన్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ ప్రథమ బహుమతి, హైదరాబాద్ విద్యుత్ సౌధ ద్వితీయ బహుమతి, ట్రాన్స్‌కో వరంగల్ తృతీయ బహుమతి దక్కించుకున్నాయి.
జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామంలో ‘సర్’ ప్రక్రియ వందశాతం పూర్తయినట్లు తహసీల్దార్ కిరణ్మయి శనివారం తెలిపారు. ఈసందర్భంగా సర్ ప్రక్రియను పూర్తి చేసిన బీఎల్‌వోలను ఆమె సత్కరించారు. సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ నందు యాదవ్, జీపీవో పృథ్వీరాజ్, వార్డు సభ్యుడు మహేష్, పాల్గొన్నారు.
31లోగా ఈ–కేవైసీ పూర్తి చేయాలి
సుభాష్‌నగర్: జిల్లాలో ఆహారభద్రత కార్డుల్లో ఉన్న సభ్యులందరి ఈ–కేవైసీని ఈనెల 31వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు ఏదైనా రేషన్ షాపులో ఈ–కేవైసీని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రేషన్‌కార్డులు కలిగి ఉన్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


