పెర్కిట్(ఆర్మూర్): పట్టణంలో అడ్వాన్స్‌డ్ టెక్నాల జీ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాల ని విద్యార్థి సంఘాల నాయకులు అంగరి ప్రదీప్, షాహిద్ అలీ ఆధ్వర్యంలో నాయకులు మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ సచివాలయంలో శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఏటీసీ సెంటర్ నిర్మాణం కోసం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతంలో భూమి కేటాయింపు జరిగిన నిర్మాణంలో జాప్యం నెలకొందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన 40 గ్రామాల విద్యార్థులు సాంకేతిక విద్యనభ్యసించడానికి ఇతర ప్రాంతాల్లోని ఏటీసీ సెంటర్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మంత్రిని కలిసిన వారిలో జమాత్ ఎ ఉల్మా ప్రతినిధి ఇబ్రహీం, మర్కజ్ కమిటీ కార్యదర్శి రిజ్వాన్, జాఫర్ అలీ, షైబాజ్ తదితరులు ఉన్నారు.


