● వర్షాలు సమృద్ధిగా కురవాలని
పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు
● పలు చోట్ల గోదావరి నుంచి తెచ్చిన
గంగ జలాల ఊరేగింపు
వర్ని/రుద్రూర్/బోధన్ రూరల్ : వర్ని మండలం జాకోరా, చందూరు మండలం ఘన్‌పూర్ గ్రామా ల్లో వర్షాలు సమృద్ధిగా కురియాలని గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ గో దావరి నది నుంచి తీసుకువచ్చిన జలాలతో గ్రామదేవతలకు అభిషేకం చేసినట్లు సర్పంచ్‌లు ముత్తకుంట కృష్ణ, ఫారం సాయిలు వెల్లడించారు. వీడీసీ చైర్మన్ లాలాబోయి, సభ్యులు సాయి గోండా, సంజీవ్, మాజీ సర్పంచ్ గంగారాం, సాయిలు, శేఖర్ పాల్గొన్నారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. కందకుర్తి త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి గ్రామదేవతలకు అభిషేకం, ప్రత్యేక పూ జలు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పట్ల సురేశ్, మాజీ జెడ్పీటీసీ నరోజి గంగారాం, ద త్తాత్రి, కృష్ణ, కుర్మాజీ గంగారాం, సంతోష్, కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలంలోని కల్దుర్కి, అమ్దాపూర్, ఊట్‌పల్లి గ్రామాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్తు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పవిత్ర త్రివేణి సంగమం నుంచి గంగజలాలను తీసుకువచ్చి ఆయా గ్రామాల్లోని ఊరేగింపు నిర్వహించారు.కార్యక్రమంలో గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
నవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో గ్రామస్తులు శుక్రవారం గోదావరి జలాలతో గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించారు.


