వేల్పూర్(మెండోరా): మెండోరా మండలం శ్రీరాంసాగర్ జాతీయ చేపల ఉత్సత్తి కేంద్రం వద్ద మత్స్యకారులకు శుక్రవారం జిల్లా ఏడీఏ నాగులు, ఎఫ్‌డీవో దామోదర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మత్స్యకారులు చేపల వేటలో ఉపయోగించే పనిముట్లను వివరించారు. శ్రీరాంసాగర్ పరిధిలో సుమారు 2 వేల మంది చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి ఉన్నందున వృత్తి పనిముట్లు సకాలంలో అందించాలని జిల్లా గంగపుత్ర నాయకుడు సోన్ నారాయణ అధికారులను కోరారు. సమావేశంలో ఎస్సారెస్పీ పరిధి మత్స్యకారులు పాల్గొన్నారు.
వృద్ధులు, దివ్యాంగుల
సర్ కు కౌన్సిలర్ల సహాయం
ఆర్మూర్: ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా చేపట్టిన సర్‌లో ఎన్యుమరేషన్ ఫారాలను నింపడానికి ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగులకు కౌన్సిలర్లు సహాయం చేస్తున్నారు. పట్టణంలోని 34, 33, 13వ వా ర్డుల్లో కౌన్సిలర్లు నర్మె నవీన్, రాణి సుమన్, కొ డిగెల మల్లయ్యలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల ఎ న్యుమరేషన్ ఫారాలను నింపి తిరిగి ఇచ్చారు.
వందశాతం సర్
పూర్తి చేయించాలి
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) వందశాతం పూర్తి చేయించాలని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భీమ్‌గల్ పట్టణంలో శుక్రవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బీఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మాట్లాడి సర్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భీమ్‌గల్ వెనుకబడి ఉందని పార్టీ శ్రేణులు వేగవంతం చేయాలని సూచించారు. మండలాధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, టౌన్ ప్రెసిడెంట్ అనంత్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు రత్నాకర్‌గౌడ్, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు జనార్దన్, నాయకులు కన్నె సురేందర్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గ్రామశాఖ కార్యవర్గం ఎన్నిక
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండలం హాసాకొ త్తూర్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ నూతన కార్యవర్గాన్ని గ్రామశాఖ అధ్యక్షుడు ఎడ్ల శ్రీకాంత్ అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా చిన్నవేళ శ్రీనివాస్, కార్యదర్శిగా ఎదుల రాజు, కోశాధికారిగా రాదారపు సాయ న్న, కార్యదర్శిగా శేఖర్, ప్రధాన సలహాదారులుగా సీహెచ్. గంగాధర్, మేడం రమేశ్, కనక గంగన్నలను ఎన్నుకున్నారు.
ఉప సర్పంచ్‌ల ఫోరం చేయూత
కమ్మర్‌పల్లి(మోర్తాడ్): గుండెపోటుతో ఇటీవల మరణించిన ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారం పావని కుటుంబానికి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం చేయూత అందించింది. శుక్రవారం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ జిల్లాలోని పలు గ్రామాల ఉప సర్పంచ్‌లతో క లిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఫోరం తరపున రూ. 31 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షు డు ఇస్సాపల్లి మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, ఏర్గట్ల అధ్యక్షుడు ఆశిరెడ్డి హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జానకంపేటలో బాధిత కుటుంబానికి..
బోధన్: ఎడపల్లి మండలం జానకంపేటలో నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు పోచమ్మల సాయిలు(34) పాముకాటుకు గురై గురువారం మృతి చెందిన విష యం తెలిసిందే. సాయిలు కుటుంబానికి 50 కిలో బియ్యం,ఇతర నిత్యావసర సరుకులు,కొంత నగదును గ్రామ యువకులు చేయుత అందించారు.


