నిజామాబాద్ అర్బన్: గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ ‘గ్రామోత్సవ్’ పేరుతో వినూత్న కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ వేదికను ప్రారంభించింది. తొలి గ్రామోత్సవ్‌ను శుక్రవారం కంఠేశ్వర్‌లోని లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమంలో ము త్తూట్ ఫిన్‌కార్ప్ అందిస్తున్న 24 రకాల ఆర్థిక ఉత్పత్తులు, సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చారు. ముత్తూట్ ఫిన్‌కార్ప్ సీఈవో షాజీ వర్గీస్ మాట్లాడుతూ.. వినియోగదారులతో సంస్థకు ఉన్న విశ్వాస బంధాన్ని మరింత బలోపేతం చేయడమే గ్రామోత్సవ్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఆర్థిక సేవలు కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా, ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నా రు. జిల్లాలో సంస్థకు ఇప్పటికే ఐదు శాఖలు, తెలంగాణ వ్యాప్తంగా 200కు పైగా శాఖలు ఉండటంతో తొలి గ్రామోత్సవ్ నిర్వహణకు ఈ నగరాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన విని యోగదారులకు కార్యక్రమం వేదికపైనే రుణాల మంజూరుపై నిర్ణయం వెల్లడించారు. అనంతరం నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. ముత్తూ ట్ అందిస్తున్న సేవలు ఎంతో బాగున్నాయన్నాని అన్నారు. కార్యక్రమంలో ముత్తూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.


