బోధన్: బోధన్‌కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యాయవాదుల చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. సీనియర్ న్యాయవాదులు మారుతిరావు ఖన్నా, మధుసింగ్‌లను ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఆర్ దేశాయ్,ప్రతినిధులు విద్యాసాగర్, మాధవీలత,న్యాయవాదులు పాల్గొన్నారు.
వర్ని లయన్స్ క్లబ్
అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నిక
వర్ని: వర్ని లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్ని మండల కేంద్రంలో శుక్రవారం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. కార్యదర్శిగా వెంకటేశం, కోశాధికారిగా రెడ్డి చౌదరి, కార్యవర్గ సభ్యులుగా నగేష్, ఠాగూర్, శివ నాగేశ్వరరావు, పీవీ సుబ్బారావు, శ్రీమన్నారాయణలను ఎన్నుకున్నారు.
ఫ్రె ౖడే డ్రై డే పాటించాలి
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని భీమ్‌గల్ ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్నారు. మండలంలోని పల్లికొండలో ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో రోడ్లను, మురికి కాలువలను పరిశీలించారు. పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సిబ్బంది ఉన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు.


