ఆర్మూర్: స్థానిక మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (బీఎల్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ చెల్లింపుల విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారని వాపోయారు. అనంతరం తమ డి మాండ్లను వివరిస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘుతో పాటు మున్సిపల్ కమిషనర్ శ్రీహ రి రాజుకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించా రు. ఈ నిరసనలో బీఎల్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కాంబ్లె మధు, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, యూనియన్ నాయకులు రాజేశ్వర్, శ్రీనివాస్, పాండు, నర్సయ్య, మల్లేష్, రూపే ష్, నాగరాజు, రేఖ, రమేష్ తదితరులున్నారు.


