షేర్‌వాల్‌ టెక్నాలజీతో పీఎస్‌ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

షేర్‌వాల్‌ టెక్నాలజీతో పీఎస్‌ నిర్మాణం

Jul 17 2026 4:04 AM | Updated on Jul 17 2026 4:04 AM

రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి

మోపాల్‌: ఆధునిక నిర్మాణ రంగంలో వేగం, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో షేర్‌వాల్‌ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌.భూపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మోపాల్‌ మండల కేంద్రంలో షేర్‌ వాల్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్న నూతన పోలీస్‌స్టేషన్‌ భవన నిర్మాణ పనులను సీఐ సురేశ్‌, ఎస్సై సుస్మిత, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పురోగతిని సంబంధిత అధికారులు, ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కూడా షేర్‌వాల్‌ టెక్నాలజీని అమలు చేసే అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన వెంట రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ శేఖర్‌గౌడ్‌, నిజామాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, ఎల్లోల్ల సాయిరెడ్డి, బోర్గాం శ్రీనివాస్‌, జలంధర్‌రెడ్డి, గంగాప్రసా ద్‌, మండల అధ్యక్షుడు రవి, సొసైటీ చైర్మన్లు మోహన్‌రెడ్డి, గంగారెడ్డి, ప్రతాప్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement