చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమం | - | Sakshi
Sakshi News home page

చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమం

Jul 17 2026 4:04 AM | Updated on Jul 17 2026 4:04 AM

బాన్సువాడ: తండ్రితో కలిసి నిద్రించిన ఓ ఏడు నెలల చిన్నారిని రాత్రి కొందరు అపహరించి బ్లేడ్‌తో దాడి చేసి పొదల్లో పడేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా.. బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన టేకు సతీశ్‌, సంధ్య దంపతులు. వీరికి 7 నెలల చిన్నారి వైష్ణవి ఉంది. ఈ నెల 14న రాత్రి సతీశ్‌ కుమార్తెతో కలిసి రాత్రి 7.30 గంటలకు ఆరుబయట నిద్రించారు. రాత్రి 8 గంటల సమయంలో సతీశ్‌ నిద్ర లేచి చూసే సరికి చిన్నారి కనిపించకపోవడంతో ఇంట్లో తల్లి వద్ద నిద్రిస్తుందేమోనని అలాగే పడుకున్నాడు. తెల్లవారుజాము 5 గంటల సమయంలో నిద్రలేచిన సతీశ్‌ చిన్నారి కోసం ఇంట్లోకి వెళ్లి చూడగా కనిపించలేదు. దీంతో భార్య శైలజ, తల్లిని అడిగాడు. తమ వద్ద లేదని చెప్పడంతో ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కాలనీలో వెతుకుతుండగా గోసంగి సంఘం భవనం వద్ద ఉన్న పొదల్లో వైష్ణవి స్పృహ కోల్పోయి కనిపించింది. వైష్ణవి ఒంటిపై బ్లేడ్‌తో కోసిన గాయాలు ఉండడంతో వెంటనే బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌కు తరలించారు. 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. సతీశ్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య శైలజ, రెండో భార్య సంధ్య ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. మొదటి భార్య శైలజకు ముగ్గురు కుమార్తెలు, సంధ్యకు వైష్ణవి ఒక్క కుమార్తెనే ఉన్నారు. అక్కాచెల్లెళ్లు ఐదు నెలక్రితం భర్త సతీశ్‌తో గొడవ పడ్డారు. తర్వాత సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్నారి వైష్ణవి మాత్రం తండ్రి సతీశ్‌ వద్దే ఉంటోంది. కాగా తన కుమార్తైపె బ్లేడ్‌తో దాడి చేసింది శైలజ అంటు తల్లి సంధ్య పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement