తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బీపీఈడీ 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 95 మందికి 75 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరైనట్లు అకాడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఆర్మూర్ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఒక విద్యార్థి డిబార్ అయినట్లు పేర్కొన్నారు. మధ్యా హ్నం నిర్వహించిన పరీక్షలకు 36 మందికి 31 మంది హాజరు కాగా ఐదుగురు గైర్హాజరయ్యారు.
కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం..
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 28 మందికి 26మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు ముగ్గురు విద్యార్థులకు ముగ్గురు హాజరైనట్లు తెలిపారు.
దేశాభివృద్ధిలో యువత నైపుణ్యత కీలకం
తెయూ(డిచ్‌పల్లి): దేశాభివృద్ధిలో యువత నైపుణ్యాలే కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి పేర్కొన్నారు. ప్రపంచ యువాన్ నైపుణ్య దినోత్సవం సందర్భంగా తెయూ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్1 ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు రిజిస్ట్రార్ బహుమతులు అందజేశారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కీలకమని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ, విద్యార్థులు మనోహర్, శేఖర్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే సంస్థ విజయం
డిచ్‌పల్లి(తెయూ): ఉద్యోగుల సమష్టి కృషి, నాయకత్వం, సవాళ్లను ఎదుర్కొనే విధానం, సత్వర నిర్ణయాల ప్రక్రియతోనే వ్యాపార సంస్థలు విజయం సాధిస్తాయని తెయూ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ ఆంజనేయులు పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘ఏ జర్నీ ఆఫ్ బిజినెస్’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేట్ ప్రపంచంలోని వాస్తవ పరిస్థితులను మేనేజ్‌మెంట్ విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులుగా బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు సాహిల్ అవేజ్, సమత, మహేశ్ వ్యవహరించారు.


