డ్రగ్‌ ఫ్రీ తెలంగాణకు విద్యార్థులు తోడ్పడాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్‌ ఫ్రీ తెలంగాణకు విద్యార్థులు తోడ్పడాలి

Jul 17 2026 4:04 AM | Updated on Jul 17 2026 4:04 AM

రుద్రూర్‌: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఈగల్‌ ఫోర్స్‌ డీఎస్పీ ఎం సోమనాథం అన్నారు. రుద్రూర్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల (సీఎఫ్‌ఎస్‌టీ)లో గురువారం ఈగల్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎం సోమనాథం, బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజం తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. నార్కోటిక్‌, సైకోట్రోపిక్‌ పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే 1908 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ లేదా 8712671111 వాట్సాప్‌ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. ‘డ్రగ్‌ ఫ్రీ తెలంగాణ’ లక్ష్య సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్‌ వెంకట్‌రెడ్డి, రుద్రూర్‌ సీఐ కృష్ణ, ఎస్సై మనోజ్‌కుమార్‌, ఈగల్‌ ఫోర్స్‌ ఆర్‌ఎసీసీఇన్‌్‌స్పెక్టర్‌ ఏ పూర్ణేశ్వర్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement