న్యూస్‌రీల్
పదవి కోసం పైరవీలు
నిజామాబాద్
ప్రశాంత్‌రెడ్డిది..
ఉనికిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్ష చేశాడని డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి విమర్శించారు.
శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026
– 8లో u
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ రి జిస్ట్రార్ ఎం యాదగిరి తన పదవికి రాజీనామా వ్య వహారంతో క్యాంపస్‌లో హైడ్రామా నెలకొంది. బు ధవారం సాయంత్రం నుంచి రాజీనామా అంశం ఉ మ్మడి నిజామాబాద్ జిల్లాలో వైరల్‌గా మారింది. గు రువారం మధ్యాహ్నం రిజిస్ట్రార్ రాజీనామాను వీసీ యాదగిరిరావు తిరస్కరించడం, తిరిగి కొనసాగాల ని బుజ్జగించడంతో డ్రామాకు తెరపడింది.
2024 జూన్ 16 నుంచి రిజిస్ట్రార్‌గా యాదగిరి బా ధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదవీ కాలం ముగిసినప్పటికీ రిజిస్ట్రార్‌గా యాదగిరినే వీసీ కొనసాగింపజేస్తున్నారు. ఈ విషయంలో పలువురు అధ్యాపకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయన పదవి నుంచి తప్పుకుంటే తమలో ఒకరికి రిజిస్ట్రార్‌గా అ వకాశం వస్తుందని చాలా కాలంగా ఆశావహులు ఎ దురు చూస్తున్నారు. పరిపాలనా సామర్థ్యం యాదగిరికే ఉందని నమ్ముతున్న వీసీ.. ఆయననే కొనసాగింపజేయడం ఆశావహులను మరింత అసహనాని కి గురిచేస్తోందని చెప్పొచ్చు. ప్రధానంగా 2014లో నియమితులైన అధ్యాపకుల పదోన్నతుల అంశం నేపథ్యంలో రిజిస్ట్రార్‌ను తక్షణమే తొలగించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. ప్రస్తుత రి జిస్ట్రార్‌ను తొలగించి వర్సిటీలోని సీనియర్ అధ్యాపకులలో ఒకరికి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది.
రాజీనామాను తిరస్కరించిన వీసీ
గురువారం ఉదయం వర్సిటీకి వచ్చిన వీసీ యాదగిరిరావు చేతికి రిజిస్ట్రార్ రాజీనామా లేఖ అందింది. వెంటనే ఆయన యాదగిరికి ఫోన్ చేసి తన చాంబర్‌కు పిలిపించుకున్నారు. రాజీనామాను తాను ఆ మోదించడం లేదని రిజిస్ట్రార్‌గా కొనసాగాలని బు జ్జగించారు. వర్సిటీ అభివృద్ధి కోసం, పరిపాలన పారదర్శకంగా, సాఫీగా సాగడానికి మీ సేవలు అ వసరమని కోరారు. దీంతో యాదగిరి తన రాజీనామాను ఉపసంహరించుకుని మధ్యాహ్నం నుంచి విధుల్లో కొనసాగారు.
ఇంకెన్నాళ్లు రిజిస్ట్రార్‌గా కొనసాగుతారు..
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య బుధవారం యూనివర్సిటీని సందర్శించిన స మయంలో ఆయన ఎదుటే కొందరు ఇంకెన్నా ళ్లు రిజిస్ట్రార్‌గా కొనసాగుతారని యాదగిరిని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కనకయ్యను తొలగించి తనను ప్రభుత్వం రిజిస్ట్రార్‌గా నియమించిందని, ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు బా ధ్యతలు చేపట్టిన తర్వాత తనను రిజిస్ట్రార్ పద వి నుంచి తొలగించాలని పలుసార్లు కోరినా ఆ యన స్పందించలేదని యాదగిరి పేర్కొన్నారు. తనకు కనకయ్యతో వ్యక్తిగత వైరం లేదని, ఇ దంతా పొజిషన్ కోసమేనని, ఇప్పటికైనా తన ను తొలగిస్తే పాఠాలు చెప్పుకుంటానని అన్నా రు. అడగకుండానే వచ్చి కుర్చీలో కూర్చున్నా వా అంటూ.. యాదగిరిని కనకయ్య నిలదీశా రు. ఇందుకు సంబంధించిన వీడియో బుధవా రం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వై రల్ అవుతోంది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, వీ సీతోపాటు 2014 నియామక అధ్యాపకులు, జి ల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ నాయకుల ఎదుటే త నను పలువురు నిలదీయడంతో రిజిస్ట్రార్ మా నసిక వేదనకు, తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. దీంతో అదేరోజు సాయంత్రం 5.30గంటల కు తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణ యించుకున్నారు. అప్పటికే వీసీ తన వెళ్లిపోవడంతో రాజీనామా లేఖను వీసీ పీఏకు అందజేసి వెళ్లిపోయారు.
రిజిస్ట్రార్ యాదగిరి తన పదవికి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పదవి కోసం వర్సిటీలోని కొందరు సీనియర్ ప్రొఫెసర్‌లు పైరవీలు మొదలెట్టారు. ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు గురువారం ఉదయం వర్సిటీకి వచ్చి తనకే రిజిస్ట్రార్ పదవి ఖాయమని పలువురితో చెప్పుకున్నట్లు సమాచారం. అయితే మధ్యాహ్నానికి సీన్ రివర్స్ కావడంతో అందరూ తెల్లముఖం వేశారు. తిరిగి రిజిస్ట్రార్‌గా యాదగిరి బాధ్యతల్లో కొనసాగడంతో కక్కలేక మింగలేక మిన్నకుండిపోయారు.
రిజిస్ట్రార్ యాదగిరి రాజీనామా
బుజ్జగించిన వీసీ యాదగిరిరావు
తిరిగి విధుల్లో యథావిధిగా
కొనసాగింపు
ఆశావహుల్లో తీవ్ర అసహనం


