నిజామాబాద్ అర్బన్ : నందిపేట తహసీల్దార్ సంతోష్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసినట్లు విచారణలో తేలింది. ధరణిలో అవకాశాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూ ములను అక్రమంగా ఇతరులకు కేటాయించినట్లు తెలిసింది. సీసీఎల్‌ఏ నుంచి ఉత్తర్వులు రావడంతో విచారణ చేపట్టిన కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం ఉండొద్దు
వర్ని : కోట్లాది రూపాయలు వెచ్చించి రైతులకు సాగునీరందించేందుకు చేపడుతున్న సి ద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో నా ణ్యత లోపం లేకుండా చూడాలని రాష్ట్ర ప్ర భుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువా డ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారు లను ఆదేశించారు. గురువారం హైదరాబా ద్‌లోని తన కార్యాలయంలో ఇరిగేషన్, అట వీశాఖ అధికారులతో రిజర్వాయర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ముంపునకు గురవుతున్న భూముల రైతులకు నష్టప రిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు రూ.55.30 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించా రు. అటవీశాఖ పీసీసీఎఫ్ శ్రావణ్, ఇరిగేషన్ ఈఎన్‌సీ శ్రీనివాస్, కామారెడ్డి ఇన్‌చార్జి సీఈ దక్షిణామూర్తి, ఈఈ రాజశేఖర్ పాల్గొన్నారు.
ఎన్‌డీసీసీబీకి ఉత్తమ
పనితీరు అవార్డు
సుభాష్‌నగర్: రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు నాబార్డ్ 45వ జాతీయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ)కి ఉత్తమ పనితీరు అవార్డు వరించింది. అవార్డును తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్, ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ నీలేష్ ద్వివేది చేతుల మీదుగా ఎన్‌డీసీసీబీ సీఈఓ నాగభూషణం వందే, డిప్యూటీ జనరల్ మేనేజర్ లింబాద్రి అందుకున్నారు. ఈ అవార్డు బ్యాంకు పాలకవర్గం, యాజమాన్యం, సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని సీఈఓ నాగభూషణం వందే పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని డీసీసీబీల సీఈవోలు, ఉన్నతాధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
గర్భిణికి ఎక్స్‌పైరీ టాబ్లెట్స్
రుద్రూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్భిణికి గడువు ముగిసిన మాత్రలు ఇచ్చారు. సదరు గర్భిణీ మామ మాట్లాడుతూ.. తన కోడలు ప్రతి నెలా రుద్రూర్ పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయించుకుంటోందని, గత నెల 2వ తేదీన వైద్యులు 60 కాల్షియం మాత్రలు రాసి ఇవ్వగా, వాటిని వినియోగిస్తున్న సమయంలో మందుల ప్యాకెట్‌ను పరిశీలించగా, గడువు తేదీ మే 31 నాటికి ముగిసినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై పీహెచ్‌సీ వైద్యురాలు ఆయేషాను వివరణ కోరగా.. పొరపాటు జరిగిందని అంగీకరించారు. ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా గడువు ముగిసిన టాబ్లెట్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒక్క డబ్బా ఎలా ఎలా వచ్చిందో విచారణ చేస్తున్నామన్నారు. టాబ్లెట్ వేసుకున్న గర్బిణీకి స్కానింగ్ చేసి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.


