నిజామాబాద్ అర్బన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్ధేశించిన భవిత సెంటర్‌ల నిర్మాణా లు, మరమ్మతుల పనులను, కస్తూర్బా విద్యాల యాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. త్వరితగతిన అన్ని కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం భవిత సెంటర్లు, కేజీబీవీ నిర్మాణాలు, పీఎంశ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తాగునీటి సమస్య తలెత్తొద్దు..
జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని, పైప్ లైన్ లీకేజీలు లేకుండా, తాగునీరు కలుషితం కాకుండా చూడాల న్నారు. ప్రతి నివాస ప్రాంతంలో చివరి వరకు తాగునీరు సరఫరా జరిగేలా పకడ్బందీ పర్య వేక్షణ చేయాలని సూచించారు అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, డీఈవో అశోక్, ఇంజినీరింగ్ విభాగం ఈఈ రవీందర్, ఏఈ ఉదయ్‌కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


