మోపాల్(నిజామాబాద్‌రూరల్) : రైతులకు త క్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందించడ మే ప్రభుత్వ లక్ష్యమని, మంచిప్ప–కొండెం చె రువు ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే పూర్తి చే యాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి మండలంలోని మంచిప్పలో ఉన్న కొండెం చెరువు ప్రాంతాన్ని సందర్శించిన సుదర్శన్‌రెడ్డి.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ మ్యాప్‌తోపాటు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో పనులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ త కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు రైతులతో సమావేశం ఏర్పా టు చేసి, వారి సలహా మేరకే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూపకల్పన చేశామన్నారు. రూ. 900 కోట్లతో నవీపేట్ మండలం బినోల నుంచి సారంగాపూర్ వరకు 20 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసి మోటార్లు బిగించి ట్రయల్ రన్ చేపట్టామని గుర్తుచేశారు. సారంగాపూర్ నుంచి మంచిప్ప వరకు అవసరం మేరకు మరో 9 కిలోమీటర్ల టన్నెల్, పంప్‌హౌజ్, ఇతర పనులకు రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 85 శాతం పనులు పూర్తి చేశామన్నారు. కేవలం రూ.300 కోట్లు ఖర్చు చేస్తే రైతులకు సాగునీరు, కామారెడ్డికి తాగునీరు అందేదని తెలిపారు. ఆ తర్వాత స్వార్థపరుల ప్రభుత్వం ఏర్పడి కమీషన్ల కోసం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి అంచనా వ్యయాన్ని రూ.3వేల కోట్ల భారీ మొత్తానికి పెంచేశారని ఆ రోపించారు. రూ.1800 కోట్లు ఖర్చు చేసి ఒక్క గుంటకు కూడా నీరందించలేకపోయారని, అ యినా సిగ్గు లేకుండా కొందరు నాయకులు మా ట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నివేదిక వచ్చాక సీఎంను కలుస్తాం
తక్కువ ఖర్చుతో పాత డిజైన్ ప్రకారమే పనులు చేపట్టాలని నిర్ణయానికి వచ్చామని, ఇందుకో సం అవసరమైన నిధులు, సాంకేతిక ప్రణాళిక ను రూపొందించి నివేదించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామని రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి తెలిపారు. నివేదిక వచ్చాక జిల్లా ప్రజాప్రతినిధులు, టీపీసీసీ అధ్యక్షుడితో సహా సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రిని కలుస్తామన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టు ద్వారా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లోని సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు.
ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార కార్పొ రే షన్ చైర్మన్ శేఖర్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డిరాజారెడ్డి, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కా ట్‌పల్లి నగేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, మంగూరపు రవి, ఇరిగేషన్ ఎస్‌ఈలు ప్రమీల, నజీర్ హుస్సేన్, ఈఈ నరేంద్రకుమార్, డీఈలు గంగాధర్, భూమన్న, స్థానిక అధికారులు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
రెండో కాళేశ్వరంగా రిజర్వాయర్
రైతుల శ్రేయస్సు కోసం ప్రాణహిత – చేవెళ్ల డిజైన్
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో
కలిసి ప్రాజెక్ట్ పనులు పరిశీలన


