వేల్పూర్(మెండోరా): గోదావరి పుష్కరాల (2027)కు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతాచర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, తాత్కాలిక పోలీస్ సహాయ కేంద్రాలు, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటుపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సీపీ సాయి చైతన్య ఆదేశించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సీపీ మెండోరా మండలం పోచంపాడ్ వద్ద పుష్కర ఘాట్‌లను గురువారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి పోలీసుశాఖ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి, మెండోరా ఎస్సె సుహాసిని, ఇరిగేషన్ డీఈ సురేశ్, మెండోరా డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ వేణుగోపాల్, ఏఈలు సుశాంత్‌కుమార్, వంశీ తదితరులు సీపీ వెంట ఉన్నారు.


