మరింత సమయం | - | Sakshi
Sakshi News home page

మరింత సమయం

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
సర్‌కు

గడువు పొడిగింపుతో ఊపిరి పీల్చుకున్న

అధికార యంత్రాంగం, ఓటర్లు

వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ

గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026

ముదురుతున్న నారు

నీరు లేక నెర్రెలు..

వేగవంతంగా

డిజిటలైజేషన్‌..

నిజామాబాద్‌ అర్బన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు కేంద్ర ఎన్నికల సంఘం గడువును పొడిగించడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల పంపిణీ పూర్తయినప్పటికీ అవి తిరిగి బీఎల్‌వోల చేతికి అందడం కొంత ఆలస్యమవుతోంది. ఓటర్లు అందించిన ఫారాలను డిజిటలైజ్‌ చేస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ మినహా జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో సర్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరోవైపు ఫారాలను పూరించడంలో కొన్ని చోట్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన గడువు తేదీ సమీపిస్తుండడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తాజాగా గడువును వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు.

ఆగస్టు 10న డ్రాఫ్ట్‌ జాబితా..

గడువు పొడిగింపు నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీన డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరణ కొనసాగుతుంది. అలాగే అక్టోబర్‌ 8 వరకు అభ్యంతరాలు పరిష్కారం కొనసాగుతుంది. అక్టోబర్‌ 12వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.

ప్రాథమిక సమాచారం ఇచ్చినా

పర్వాలేదు

2002 ఓటరు జాబితాలో వివరాలు లేనివారు ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు పొందుపరచి, ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్‌, ఫొటో జతచేసి బీఎల్‌వోలకు ఫామ్‌ అందజేయొచ్చు. అలాంటి వారి పేరు కూడా ముసాయిదా ఓటరు జాబితాలో చేరుస్తారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌వో) నోటీసు జారీ చేసే హియరింగ్‌కు పిలుస్తారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు ధ్రువీకరణ పత్రాలలో ఏదైనా ఒక దానిని చూపిస్తే ఓటరు తుది జాబితాలో పేరు చేరుస్తారు.

జిల్లాలో ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల పంపిణీ వందశాతం పూర్తయ్యింది. మొత్తం 14,39,734 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 10,62,624 (73.81 శాతం) మందికి సంబంధించిన ఫామ్‌లు డిజిటలైజ్‌ అయ్యాయి. చందూర్‌ మండలంలో 92.21 శాతం, డొంకేశ్వర్‌ మండలంలో 92.72, నందిపేట మండలంలో 89.45 , రెంజల్‌ మండలంలో 89.37, ముప్కాల్‌లో 89.50, ఏర్గట్లలో 86.52, సిరికొండలో 82.80 శాతం డిజిటలైజేషన్‌ పూర్తికాగా, అతి తక్కువగా నిజామాబాద్‌ నార్త్‌ మండలంలో 44.62 శాతం , సౌత్‌ మండలంలో 44.73 శాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement