వేల్పూర్: సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వా మ్యబద్ధంగా, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన పోలీసుల ఆంక్షల మ ధ్య తన స్వగృహంలోనే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం భీమ్‌గల్ ప్రజల వైద్య అవసరాల కోసం వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేసిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని చె ప్పారు. మిగిలిన పనులు పూర్తి చేయాలని గత రెండున్నరేళ్లుగా అసెంబ్లీలో, భీమ్‌గల్ వేదికగా అనేక పోరాటా లు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బస్ డిపోను పునరుద్ధరించాలని, సీసీ రోడ్డు, మార్కెట్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాలుగు డిమాండ్ల సాధన కోసం తాను భీ మ్‌గల్‌లో ఒకరోజు నిరాహార దీక్షకు అనుమతి కో రుతూ సీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వోలకు ముందస్తు సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ పైఅధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతూ వేకువజాము నే పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి బయటకు రాకుండా గృహ నిర్భంధం చేశారన్నారు. భీమ్‌గల్‌లో దీక్ష కోసం వేసిన టెంట్లను, స్టేజీని తొలగించడమే కాకుండా ప్లెక్సీలను సైతం పోలీసులు చించి వేశారని ఆరోపించారు. భీమ్‌గల్‌లో వంద పడకల ఆస్పత్రి ప్రారంభమయ్యేవరకు, మూతపడిన బస్ డిపోను తెరిపించేవరకు, మార్కెట్, అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల పనులు పూర్తయ్యే వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై శాంతియుత
దీక్షకు భయమెందుకు?
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
మాట తప్పారు
అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు
విశ్రమించేది లేదు
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
పోలీసు పహారాలో స్వగృహంలోనే
కొనసాగిన దీక్ష


