అమ్మ పేరున మొక్క | - | Sakshi
Sakshi News home page

అమ్మ పేరున మొక్క

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగనున్న

కార్యక్రమం

జిల్లాలో లక్ష మొక్కలు నాటడం టార్గెట్‌

మండలానికి 5 వేల మొక్కలు

ఖలీల్‌వాడి: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్ర భుత్వం ‘అమ్మ పేరుతో మొక్క’ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. జాతీయ విద్యార్థి పర్యావరణ పో టీ పేరుతో బుధవారం నుంచి జిల్లాలో ’ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌ (అమ్మ పేరుతో ఓ మొక్క)–సోయింగ్‌ టు గ్రోయింగ్‌–2026’ కార్యక్రమాన్ని చేపడుతున్నా రు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్య క్ర మం సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు కొనసాగనుంది. విద్యార్థులు తమ తల్లిపేరుతో ఒక మొక్కను నాటనున్నారు. జిల్లాలోని 33 మండలాల్లోని 1156 ప్ర భుత్వ, 290కి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్క నాటాల్సి ఉంటుంది. స్కూల్‌ ఆవరణతోపాటు విద్యాసంస్థలకు సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేసేలా జిల్లా విద్యాశాఖ ఎంఈవోలు, హెడ్‌ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

స్కూళ్లకు ప్రోత్సాహం

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే ఐదుగురు విద్యార్థులకు విద్యాశాఖ ప్రోత్సాహకాలను అందించనుంది. తన తల్లి పేరుతో మొక్కను నాటిన విద్యార్థులంతా నాటిన మొక్కతో సెల్ఫీ తీసుకొని ఏకో క్లబ్‌ ఫర్‌ మిషన్‌ లైఫ్‌ వెబ్‌ సైట్‌లో ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. ఆ తరువాత విద్యార్థికి సర్టిఫికెట్‌ జనరేట్‌ అవుతుంది. దీంతో పాటు పర్యావరణంపై విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించి సెప్టెంబర్‌ 20న ఫలితా లు వెల్లడిస్తారు. జిల్లాల వారీగా అత్యధిక స్కోర్‌ సాధించిన ఐదుగురు విద్యార్థులకు, ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా కృషి చేసిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందిస్తుంది.

పర్యావరణంపై

అవగాహన కోసమే..

విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహ న కల్పించడంతోపాటు మొక్కల పెంపకం మానవ జీవన విధానంలో భాగంగా ఉండేలా విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లల్లో అధికారులు మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిబడిలో 10 పండ్ల మొక్క లు నాటాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మండలంలో 5 వేల మొక్కలు నాటేందు కు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకే మొ క్కల సంరక్షణ బాధ్యత అప్పగించనున్నారు.

ప్రతి విద్యార్థి మొక్కలు నాటాలి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమ్మ పేరిట మొక్క కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన ప్రతి విద్యార్థి మొక్కనా టి దానిని సంరక్షించాలి. విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయాలి. దీంతో పచ్చదనం ఏర్పడి పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది.

– గంగాకిషన్‌, జిల్లా సైన్స్‌ అధికారి, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement