జీజీహెచ్‌లో మరింత మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో మరింత మెరుగైన వైద్యం అందించాలి

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

సుభాష్‌నగర్‌: జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ద్వా రా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందేలా అధికారులు, వైద్యులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సూచించారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధ్యక్షతన మాతా శిశు సంరక్షణ ఆస్ప త్రి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాకేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల ద్వారా అందిస్తున్న వై ద్యసేవలు, సదుపాయాలు, వసతు లు, వైద్య పరికరాల గురించి సుదర్శన్‌రెడ్డి సంబంధిత విభాగాల అధిపతుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై ద్యులు, సిబ్బంది ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని సూచించారు. జీజీహెచ్‌కు సగటున ప్రతిరో జూ సుమారు 1,700 నుంచి 2వేల మంది వరకు ఇన్‌ పేషెంట్లు వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రోగులకు సంతృప్తికరంగా వైద్యసేవలందించాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రిలో తగిన మరమ్మతులు, అభివృద్ధి పనులు సకాలంలో చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని టీ జీఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలి..

జీజీహెచ్‌లో అపారమైన అనుభవం ఉన్న వైద్యులు ఉన్నందున వారి సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించాలని ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, డాక్టర్‌ భూపతిరెడ్డి కోరారు.

ఆయా విభాగాల్లో అందుబాటులో ఉన్న పరికరాలు, అవసరమైన వెంటిలేటర్లు, మౌలిక సదుపాయాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికలను సమర్పించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించా రు. నగర మేయర్‌ ఉమారాణి, ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కవితారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర వ్యవ సాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ శేఖర్‌ గౌడ్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కృష్ణమోహన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎల్‌ రాములు, డీఎంహెచ్‌వో రాజశ్రీ, సంబంధిత విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

రోగులతో మర్యాదపూర్వకంగా

వ్యవహరించాలి

ప్రభుత్వ సలహాదారు

పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి

జీజీహెచ్‌ అభివృద్ధి సలహా

సంఘ సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement