● ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఎన్యుమరేషన్ ఫామ్‌లను బీఎల్‌వోలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్‌లు సమర్పించేందుకు గడువు ముగియనున్నదని, వివరాలను డిజిటలైజ్ చేయా ల్సి ఉందన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకించి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందజేసే విషయంలో తాత్సారం చేయొవద్దని, నిర్లక్ష్యం వహిస్తే ఓటరు జాబితా నుంచి పే రు గల్లంతవుతుందని స్పష్టం చేశారు. ఎవరికై నా గత 2002 ఎస్‌ఐఆర్ వివరాలు తెలియకపోతే సర్కిల్ వారీగా నెలకొల్పిన హెల్ప్ డెస్క్‌ను లేదా బీఎల్‌వోలను సంప్రదించాలని సూచించారు. అయినప్పటికీ వివరాలు తెలియని పక్షంలో ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు పొందుపరచి ఫామ్ అందజేయొచ్చన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో ఉంటూ క్రియాశీలక పాత్ర పోషించాలని, ప్రతి రోజూ ఓటర్ల నుంచి 50 చొప్పున ఫామ్‌లు సేకరించి బీఎల్‌వోలకు అందించేలా చొరవ చూపాలన్నారు. అందుబాటు లో లేని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్ళిన, రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్ల పేర్లను గుర్తిస్తూ పక్కాగా జాబితాను రూపొందించి, వాటిపై బీ.ఎల్‌వోల సంతకాలు తీసుకోవాలన్నారు.


