‘సామాజిక బహిష్కరణ’పై విచారణ | - | Sakshi
Sakshi News home page

‘సామాజిక బహిష్కరణ’పై విచారణ

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామంలో ఓ కులానికి చెందిన వ్యక్తులపై సామాజిక బహిష్కరణ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, సభ్యుడు రాంబాబు బుధవారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగేలా చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. వారివెంట అడిషనల్‌ కలెక్టర్‌ భుజంరావు, పోలీసు అధికారులు, ఆయా శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement