రెంజల్: జాతీయోద్యమంలో భారత జాతిని వందేమాతర గేయం జాగృతం చేసిందని అదనపు కలెక్టర్ భుజంగరావ్ పేర్కొన్నారు. సీసీఆర్‌టీ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమి న్యూఢిల్లీ ఆధ్వర్యంలో మండలంలోని దూపల్లి హైస్కూల్‌లో బుధవారం రాత్రి వందేమాతరం 150 సంవత్సరాల జాతీయ వేడుకలను నిర్వహించారు. అదనపు కలెక్టర్ భుజంగరావ్‌తో పాటు డీఈవో అశోక్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భారత స్వాతంత్రానికి 75 ఏళ్ల ముందు స్వాతంత్రం తర్వాత 150 సంవత్సరాలుగా జాతీయ గేయాన్ని ఆలపిస్తున్నామని, అది పాడుతున్నప్పుడు దాని రచనలో ఉన్న గొప్పతనమని వివరించారు. సమావేశంలో సర్పంచ్ దువ్వూరి నర్సవ్వ, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, హెచ్‌ఎం మాధవరెడ్డి, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు సోమలింగంగౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాబన్న, మాజీ అధ్యక్షుడు లింగంయాదవ్ తదతరులు పాల్గొన్నారు.


